డిఎస్ రాజీనామా చేయాలి: ఈటెల రాజేందర్

తాము ఎల్లుండి అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరుతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం సరి కాదని, రేషం ఉంటే వారు రోశయ్యపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. నలబై దేశాల్లోని తెలంగాణ ఎన్నారైలు ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలంగాణ విముక్తికి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఐదు రోజులుగా తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంటే, విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తుంటే రోశయ్య అంతా సవ్యంగా ఉందని చెప్పడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications