దీక్ష విరమించను: దానంతో కెసిఆర్

కాగా, నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కెసిఆర్ చికిత్స పొందుతున్న బ్లాక్ లోకి దూసుకెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. కెసిఆర్ కు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకుంది. నిమ్స్ ఆవరణలోని ఆంధ్రా బ్యాంక్ పేరును తెలంగాణ బ్యాంక్ గా మార్చారు.
కెసిఆర్ కు వైద్యులు సెలైన్ ఎక్కించడానికి ప్రయత్నించారు. సెలైన్ ఎక్కించుకోవడానికి కెసిఆర్ నిరాకరించారు. కెసిఆర్ కు లివర్ ఇన్ ఫెక్షన్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారం నిజం లేదని వైద్యులు స్పష్టంచేశారు. కెసిఆర్ శరీర భాగాలన్నీ సజావుగానే ఉన్నాయని వారు చెప్పారు. అయితే ఘన పదార్థాలు తీసుకోకపోవడం వల్ల కెసిఆర్ నీరసంగా ఉన్నారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications