తెలంగాణ అమరుల కుటుంబాలకు చేయూత

TENA
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించాలని తెలంగాణ ఎన్నారైల సంఘం (తెనా) నిర్ణయించింది. ఈ విషయాన్ని సంఘం బోర్డు సభ్యుడు డాక్టర్ వెంకట్ మారోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు 50 వేల రూపాయలేసి సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ఐటి ఫోరం ద్వారా వాటిని అందిస్తామని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని, ఏ విధమైన తీవ్ర చర్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అరెస్టును ఆయన ఖండించారు. కెసిఆర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణవ్యాప్తంగా విద్యార్థులపై పోలీసుల నర్బంధాన్ని కూడా ఆయన ఖండించారు. తెలంగాణ ఉద్యమానికి తాము బేషరతు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరాహార దీక్షల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+