సోనియాకు లేఖ: తెలంగాణ మంత్రుల నిర్ణయం

హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కె.రోశయ్యతో సమావేశమై తెలంగాణ పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రులతో ఆమె సమావేశమయ్యారు. మళ్లీ రెండో సారి కూడా తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ విషయంలో తాము ఏ విధంగా ముందుకు సాగాలనే విషయంలో వారు తీవ్ర అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ మంత్రులు శుక్రవారం రాత్రి పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. తెలంగాణ అంశాన్ని తాము సోనియా గాంధీకి విన్నవిస్తానని డిఎస్ చెప్పినట్లు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. తాము కూడా తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఈ స్థితిలో సోనియాకు లేఖ రాయాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించుకున్నారు.