ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్

ప్రత్యేకాంధ్ర ఉద్యమంపై మాజీ మంత్రి, ఆప్కాబ్ చైర్మన్ వసంత నాగేశ్వరరావు మొన్న ప్రకటించినప్పటి నుంచి క్రమంగా ఆంధ్ర ప్రాంతంలో వేడి రాజుకుంటున్నట్టు కన్పిస్తోంది.
ఆప్కాబ్ చైర్మన్, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు ప్రత్యేక ఆంధ్ర సాధనకు ఉద్యమం చేపడతానని గురువారం చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులను కూడదీసుకుని ఏఐసీసీ చైర్మన్ సోనియాగాంధీని కలసి రాష్ట్ర విభజన ఆవశ్యకతను వివరిస్తానని వసంత పేర్కొన్నారు. వసంత ప్రకటన పట్ల తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేసినా, ఆంధ్ర నేతల స్పందన ఇంకా స్పష్టం కాలేదు.












Click it and Unblock the Notifications