• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కెసిఆర్ బతికుంటేనే తెలంగాణ సాధ్యం: టిజివి

By Santaram
|

TG Venkatesh
కర్నూలు‌: టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ను చంపుకోవద్దని తెలంగాణ ప్రజలకు కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే టీజీ వెంకటేష్‌ విజ్ఞప్తి చేశారు. కర్నూల్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, కేసీఆర్‌ బతికుంటేనే తెలంగాణ వస్తుందని, కాబట్టి ఆయన్ను చంపుకోవద్దని కోరారు. రాష్ట్ర ఎంపీలతో మాట్లాడి ఢిల్లీ పెద్దలతో చర్చించి శాంతియుతంగా విడిపోతామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే రాయలసీమకు నష్టపరిహారంగా రూ. లక్ష కోట్ల ప్యాకేజీని విడుదల చేయాలని టీజీ ఈ సందర్భంగా డిమాండ్‌ను లేవదీశారు.

కాగా నిరాహారదీక్షలో ఉన్న కేసీఆర్‌ ఆరోగ్యం సాధారణంగానే ఉందని నిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఆయనకు సపోర్ట్‌ థెరపీ ఇస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సత్యనారాయణ వెల్లడించారు. లివర్‌ పరీక్షలు సాధారణంగానే ఉన్నట్టుగా నిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఆహారం తీసుకోనందువల్ల ఆయన నీరసంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X