నిలకడగా కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి

దీక్ష కొనసాగితే ప్రమాదం వాటిల్లవచ్చునని చెబుతున్నారు. బిపి, షుగర్, ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉన్నాయని వైద్యులు చెప్పారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి ఆందోళన కలిగించిందని శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. రాత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కెసిఆర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన అన్నారు. కాగా, కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు నిజం చెప్పడం లేదని ఆయన తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు విమర్శిస్తున్నారు. ప్రతి రెండు గంటలకు కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications