తెలంగాణకు పరిష్కారం వస్తుంది: కెకె

కాగా, తెలంగాణపై తమ పార్టీ సానుకూలంగానే ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణపై వీరప్ప మొయిలీని కలుసుకుని పరిష్కరించుకోవాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు రాష్ట్ర కాంగ్రెసు నాయకులకు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో దీక్ష విరమింపజేయాలని సూచిస్తున్నారు. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల చర్యను కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యతిరేకించారు. విద్యార్థులను రెచ్చగొట్ట వద్దని ఆయన సూచించారు. విద్యార్థులను రెచ్చగొడితే పరిస్థితి చేయి దాటుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications