కెసిఆర్ కు పరామర్శ: బాబుకు చేదు అనుభవం

Chandrababu Naidu
హైదరాబాద్: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును పరామర్శించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. కెసిఆర్ ను పరామర్శించడానికి ఆయన వెనక గేటు నుంచి వచ్చారు. అయితే దీన్ని పసిగట్టిన తెరాస కార్యకర్తలు ఆయనను నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు అంటూ వారు నినాదాలు చేశారు. చంద్రబాబును చుట్టుముట్టారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వం తీర్మానం పెడితే సమర్థిస్తామని ఆయన చెప్పారు. పోలీసులు తెరాస కార్యకర్తలను పక్కకు తోసేసి వలయంగా ఏర్పడి ఆయనను లోనికి తీసికెళ్లారు.

కెసిఆర్ ను సోమవారం ఉదయం కాంగ్రెసు శాసనసభ్యుడు పి.శంకరరావు కూడా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనను కూడా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణ అంశాన్ని తీవ్రంగానే తీసుకుందని ఆయన చెప్పారు. కెసిఆర్ ఆదేశిస్తే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+