తెరాస ఎమ్మెల్యేల్లారా, ఖబర్దార్: దానం

తనపై దాడి చేయడం ద్వారా తెరాస తన ఉద్యమాన్ని తానే నీరు గార్చుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. వారి వాదనను వారు వినిపించాలని, తన వాదనను తాను వినిపిస్తానని, తన వాదనను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే గ్రేటర్ హైదరాబాదును విడిగా చేయాలని తాను మాట్లాడతానని, అయితే తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ఇద్దరు విద్యార్థులు తన వద్ద లేరని, వారిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన చెప్పారు. విద్యార్థులు తన వద్దకు ఎప్పుడైనా రావచ్చునని ఆయన చెప్పారు. ఇద్దరు విద్యార్థులను దానం అనుచరులు నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications