తెలంగాణ: వరంగల్ లో వైద్యుల రిలే నిరాహార దీక్షలు

ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అశోక్‌రెడ్డి, భూమిగారి మోహన్‌రావు, సుధీర్‌కుమార్ మాట్లాడుతూ మంగళవారం నుంచి నిరాహార దీక్షలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆప్నా, ఐఎంఏ, ప్రభుత్వ వైద్యుల సంఘం, ఎంజీఎం మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఉవ్వెత్తున ఉద్యమిస్తున్న ఉద్యమకారులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి టి.జయసింహారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications