హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సినీ పరిశ్రమ తేల్చుకోవాలి: జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Shankar
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై సాయంత్రంలోగా తన అభిప్రాయాన్ని వెల్లడించాలని తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) డిమాండ్ చేసింది. సినీ నిర్మాతలు, దర్శకులు, నటీ నటులు తెలంగాణ ఉద్యమంపై తేల్చుకోవాలని జెఎసి నాయకులు మంగళవారం అన్నారు. తెలంగాణపై తమ అభిప్రాయాలను వెల్లడించకపోతే తెలంగాణలో సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించారు. ఈ డిమాండ్ కు సినిమా పరిశ్రమ నుంచి తొలి ప్రతిస్పందన వచ్చింది. తాను తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తానని ప్రముఖ దర్శకుడు శంకర్ స్పష్టం చేశారు.

ఇదిలా వుంటే, ఈ నెల 10వ తేదీన జరిగే చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని వారు తెలంగాణ విద్యార్థులను కోరారు. లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని వారు చెప్పారు. తెలంగాణలోని విద్యార్థులంతా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తరలి రావాలని, వారికి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వారు చెప్పారు. తెలంగాణకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కూడా ఈ చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాలు పంచుకుంటాయని వారు చెప్పారు. ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X