సోనియా నిర్ణయానికే చూడండి: మొయిలీ

తాము నియోజక వర్గాల్లో తిరగలేని పరిస్థితి ఉందని, తాము గ్రామాల్లో తిరగే వాతావరణం ఏర్పడాలంటే పార్టీ అధిష్టానం తగిన సహకారం అందించాల్సిందేనని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ వీరప్ప మొయిలీతో అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము తిరిగి గెలిచే పరిస్థితి ఉండదని, అంతా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన చెప్పినట్లు సమాచారం. తెలంగాణ బిల్లు పెడితే నష్టమేమిటని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వగలుగుతుందా, లేదా అనే విషయాన్ని తేల్చి చెప్పడం అవసరమని, తేల్చి చెప్తేనే కాంగ్రెసు పరిస్థితి మెరుగు పడుతుందని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ఈ సమయంలో విజయవాడ లోకసభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జోక్యం చేసుకుని ఐదేళ్ల పాటు కనిపించని కెసిఆర్ నెల రోజుల్లో ఇంత హల్ చల్ ఎలా సృష్టించారనేది పరిశీలించాల్సి ఉందని, కొన్ని దుష్టశక్తులు, కాంగ్రెసు వ్యతిరేక శక్తులు ఉద్యమంలో ప్రవేశించినట్లున్నాయేమో చూడాలని అన్నారు. తెలంగాణపై తొందరపాటు నిర్ణయం సరి కాదని, హైదరాబాద్ లోని లక్షలాది మంది అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కడప లోకసభ సభ్యుడు వైయస్ జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications