కెసిఆర్ కు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు: నిమ్స్

K Chandrasekhar Rao
హైదరాబాద్: నిరాహార దీక్ష విరమించకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జీవితానికి ప్రమాదమని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. తమ సంస్థ వైద్య బృందంతో పాటు కెసిఆర్ వ్యక్తిగత వైద్య బృందం వెల్లడించిన అభిప్రాయాన్ని తాను వెల్లడిస్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎన్ని రోజులు దీక్ష చేయగలరు, ఎన్ని క్షణాలు చేయగలరు, ఆహారం లేకుండా ఎన్ని రోజులు, ఎన్ని క్షణాలు ఉండగలరని తాము చెప్పలేమని ఆయన అన్నారు. దీక్ష విరమించకపోతే ప్రమాదకరమని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి కూడా తాము ఈ విషయం చెప్పామని ఆయన అన్నారు. ఇప్పటికే కొంత పరిస్థితి ప్రమాదంగా పరిణమించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని ఆయన చెప్పారు.

ప్రోటీన్లు, అల్బుమిన్ తగ్గాయని, ఇది అంత మంచిది కాదని ఆయన చెప్పారు. పరిస్థితిని కుమారుడు కెటి రామారావుకు కూడా చెప్పామని,అందుకు సంబంధించిన పత్రం కూడా ఇచ్చామని ఆయన అన్నారు. ఎక్కువ కాలం కెసిఆర్ ను ఇలా ఉంచడం మంచిది కాదని ఆయన అన్నారు. తాము ఇస్తున్న చికిత్స ప్రత్యామ్నాయం కాదని ఆయన అన్నారు. కెసిఆర్ ఆరోగ్యం నివురు గప్పిన నిప్పులా ఉందని, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చునని ఆయన అన్నారు. కెసిఆర్ ను పరామర్శించడానికి చాలా మంది వస్తున్నారని, దాని వల్ల కూడా ఇన్ ఫెక్షన్ రావచ్చునని, ఐసియులో ఎక్కువ కాలం ఉంచడం వల్ల గానీ ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+