అన్నవరం సత్యదేవుడి హుండీ ఆల టైమ్ రికార్డు

Annavaram Temple
అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. సత్యదేవుడు ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంత మొత్తం రావడం ఇదే ప్రథమం. రత్నగిరిపై హుండీల సొమ్ము లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. గడచిన మూడు రోజులకు 85 లక్షల 82వేల 342రూపాయలు, 175 గ్రాముల బం గారం, ఒక కేజీ 600గ్రాముల వెండి, 64 విదేశీ డాలర్లు లభించినట్లు దేవ స్థానం చైర్మన్‌ రాజా ఐవీ రామ్‌కుమార్‌ తెలిపారు.

దేవస్థానం చరిత్రలో హుండీల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించడం ఇదే మొదటిసారి కావడంతో ఈవో కె.రామచంద్ర మోహన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీ వల ఆయన చేపట్టినన నూతన సంస్క రణల కారణంగానే హుండీల ఆదా యం ఎక్కువగా రావడంవలన లెక్కిం పు కార్యక్రమం ఆలస్యమైంది. లెక్కింపులో దేవస్థానం సిబ్బందితో పాటు దేవస్థానం డిగ్రీ, జూనియర్‌ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు, సహాయ కమిషనర్‌ ఈరంకి జగన్నాధం, వైఎస్‌ఆర్‌ మూర్తి, సుబ్బారా యుడు, సీహెచ్‌ రామమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సత్యదేవుడి జన్మ నక్షత్రమైన 'మఖ' నక్షత్రం సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. తెల్లవారుజాము 2.30గం టలకు స్వామి, అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషే కాలు నిర్వహించారు. విశేష అర్చనల అనంతరం విఘ్నేశ్వరపూజ మూల మంత్ర జపములు, మహన్వాసపూర్వక రుద్రాభిషేకం, నీరాజన మంత్రా పుష్ప ములు తదితర ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం సత్యదేవుడి ఆయుష్ట హోమాన్ని వైభవంగా నిర్వ హించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+