హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాజధాని హైదరాబాదే: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
న్యూఢిల్లీ: హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఆయన గురువారం ఉదయం కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధమైన జాప్యం జరగదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే తన అభిప్రాయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ మార్చుకున్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో హైదరాబాదులో అన్నారు. నిరాహార దీక్ష చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆరోగ్యం విషయంలో ఆరోగ్య శాఖా మంత్రిగా తాను ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు ఆయన చెప్పుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X