జెసి రాజీనామా: మరింత మంది సిద్ధం

JC Diwakar Reddy
హైదరాబాద్: తన శాసనసభా సభ్యత్వానికి కాంగ్రెసు నాయకుడు జెసి దివాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాడిపత్రి శాసనసభ్యుడు దివాకర్ రెడ్డి గురువారంనాడు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం చరిత్రలో మొదటిసారి అని ఆయన అన్నారు. మరింత మంది కాంగ్రెసు రాయలసీమ శాసనసభ్యులు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. రాయలసీమ శాసనసభ్యులు గురువారంనాడు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానం శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే రాజీనామాలు చేయాలని రాయలసీమ కాంగ్రెసు శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ శాసనసభ్యులు తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు అందజేసినట్లు ప్రచారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలకు అతీతంగా తెలంగాణేతర శాసనసభ్యులంతా రాజీనామాలు చేస్తారని కాంగ్రెసు శాసనసభ్యులు చెబుతున్నారు. తమతో సంప్రదించకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెసు తెలంగాణేతర శాసనభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యవహరించిన తీరును కూడా వారు తప్పు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+