సోనియాకు ఫోన్ లో కెసిఆర్ కృతజ్ఞతలు

అలాగే, రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, బిజెపి అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణలకు కూడా ఆయన ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి కె. రోశయ్యకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు కృతజ్ఢతలు తెలిపారు. శాసనసభలో తెలంగాణ తీర్మానం పెట్టేందుకు కాంగ్రెసు అధిష్టానం అంగీకరించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కెసిఆర్ దీక్షకు మద్దతు తెలిపినందుకు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications