సీమ, ఆంధ్ర ఎంపీలతో సోనియా భేటీ

Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పెల్లుబుకిన అసంతృప్తిని చల్లార్చేంచేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ ఆంధ్ర, రాయలసీమ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. రాత్రి తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన తర్వాత గురువారం తెల్లవారే సరికి కాంగ్రెసు సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లగడపాటి రాజగోపాల్ ఏకంగా తన లోకసభ సభ్యత్వానికే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఒక్కరొక్కరే రాజీనామా బాట పట్టారు. కోస్తా, రాయలసీమ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ఆవరణలో తమ భవిష్యత్తు వ్యూహంపై చర్చలు జరిపారు. ఈ స్థితిలో సోనియా వారితో సమావేశమయ్యారు. ఈ రెండు ప్రాంతాల ఎంపీలతో పాటు మజ్లీస్ హైదరాబాద్ లోకసభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి కూడా సోనియాను కలిసినవారిలో ఉన్నారు.

తెలంగాణపై కేంద్రం బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఏకపక్ష నిర్ణయమనేది మీడియా సృష్టేనని ఆయన కొట్టిపారేశారు. రాజీనామాల గురించి తనకు తెలియదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+