హైదరాబాద్: ప్రజారాజ్యం తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి రాజీనామా చేయాలని రాయలసీమ హక్కుల కమిటీ కన్వీనర్ టిజి వెంకటేష్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా చిరంజీవి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమైక్యాంధ్రకు తాము కట్టుబడి ఉన్నామని, తాము తమ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన అన్నారు. తాము వేలి ముద్రగాళ్లం కాదని ఆయన చెప్పారు.
తాము శాసనసభకు వెళ్లి సమైక్యాంధ్ర ప్రదేశ్ నినాదాలు చేసి బయటకు వచ్చామని ఆయన చెప్పారు. తమకు సమైక్యాంధ్రప్రదేశ్ కు సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడాలని ఆయన డిమాండ్ చేశారు. తాము తమ ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేయబోమని, వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, అందుకే రాజీనామాలు చేశామని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి