కాకినాడ నుంచి 7 రాష్ట్రాల మీదుగా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! డేట్, హాల్ట్ లు ఇవే..!
కాకినాడ (Kakinada) ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఈ మధ్య వరుసగా కాకినాడ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు కొత్త రైళ్లు ప్రకటిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇవాళ మరో కీలక ప్రకటన చేసింది. కాకినాడ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రకటించింది. ఈ రైలు ఎప్పటి నుంచి రాకపోకలు సాగిస్తుంది, ఏయే స్టేషన్లలో ఆగుతుంది, ఇతర వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి హర్యానాలోని హిస్సార్ కు కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును (నంబర్ 17295) అధికారులు ప్రకటించారు. కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి మే 12వ తేదీ నుంచి ప్రతీ మంగళవారం ఈ రైలు ఉదయం 5.40కు హిస్సార్ కు బయలుదేరుతుంది. ఇది సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మేడ్చల్, కామారెడ్డి, నిజమాబాద్, బాసర మీదుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి హర్యానాలోని హిస్సార్ కు ప్రతీ గురువారం చేరుకుంటుంది.

అలాగే హిస్సార్ నుంచి మరో రైలు (నంబర్ 17296) ఈ నెల 15 నుంచి ప్రతీ శుక్రవారం కాకినాడకు బయలుదేరుతుంది. ఇది కూడా ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా కాకినాడ టౌన్ స్టేషన్ కు ప్రతీ ఆదివారం చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ రెండు ఫస్ట్ ఏసీ, 3 సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, 8 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతానికి ప్రయాణాలు చేసే వారికి ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా రాజధాని, వందే భారత్ రైళ్లలో టికెట్లు దొరకని సమయంలో ఇది పనికొస్తుంది.















Click it and Unblock the Notifications