టెస్టుల్లో టీ20 ఫార్మట్ సిక్సర్లు- టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అరుదైన రికార్డ్
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో ఓ నూతన చరిత్ర సృష్టించాడు. క్రీజ్ లో అడుగుపెడితే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పంత్ ఈ అద్భుతమైన మైలురాయిని అధిగమించాడు.
టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో రిషభ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే తన టెస్ట్ కెరీర్‌లో 20వ అర్ధ సెంచరీని కూడా పూర్తి చేశాడు. శ్రీలంక బౌలర్ వేసిన బంతిని లాంగ్ లెగ్ మీదుగా అద్భుతమైన పుల్ షాట్ ద్వారా సిక్సర్‌గా మలచడంతో అతని టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో వందో సిక్స్ నమోదైంది. కేవలం 51 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత సాధించడం విశేషం. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకుని రికార్డు నెలకొల్పాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 100 సిక్సర్లు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్ గా కూడా చరిత్ర సృష్టించాడు రిషభ్ పంత్. మొత్తంగా 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఈ క్లబ్‌లో ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్ కల్లమ్, ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ దిగ్గజాల సరసన పంత్ స్థానం సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత స్థానంలో 107 సిక్సర్లతో బ్రెండన్ మెకల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 100 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. వారందరి కంటే అత్యంత తక్కువ మ్యాచ్‌ల్లోనే పంత్ వంద సిక్సర్ల మైలురాయిని అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన శతకంతో భారీ స్కోరుకు పునాది వేయగా, రెండో ఇన్నింగ్స్‌లో పంత్ తనదైన శైలిలో వేగంగా పరుగులు రాబట్టాడు. 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.టెస్ట్ క్రికెట్ అంటే డిఫెన్స్ ఆడటం మాత్రమే కాదని, దూకుడుతో కూడిన బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టవచ్చని పంత్ మరోసారి నిరూపించాడు.













Click it and Unblock the Notifications