SIR ముసాయిదా జాబితాలో పేరు లేదా- ఓటు పొందాలంటే.. ఇలా.!!

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ఎన్యుమరేషన్ పూర్తయింది. ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసారు. పెద్ద సంఖ్యలో ఓట్లు లేకపోవటంతో... కొంత మందిలో ఆందోళన కనిపిస్తోంది. జాబితాలో పేరు లేకుంటే ఏం చేయాలన్నదానిపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముసాయిదాలో పేరు లేనంత మాత్రాన ఓటు హక్కు కోల్పోరని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. లిస్టులో పేరు లేకపోయినా.. ఓటు ఎలా పొందాలో కీలక సూచనలు చేస్తున్నారు.

SIR ప్రక్రియలో భాగంగా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ సమయంలో పెద్ద సంఖ్య లో ఓట్లు లేకపోవటంతో... కొందరిలో సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ముసాయిదా జాబితాలో ఓటు లేకపోయినా.. అభ్యంతరాలు, అప్పీళ్ల ద్వారా ఓటును తిరిగి పొందవచ్చని ఎన్నిక ల అధికారులు చెబుతున్నారు. పేరు లేని వారికి ఎన్నికల అధికారులు జారీ చేసిన నోటీసులకు సకాలంలో స్పందించాలని సూచిస్తున్నారు. ఎన్యూమరేషన్‌ ప్రక్రియలో పాల్గొనని, చిరునామా మార్చుకున్న, మరణించిన, డూప్లికేట్‌గా గుర్తించిన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలిగించినట్లు వివరించారు. ముసాయిదా జాబితాలో పేరు లేకున్నా.. తమ వివరాలపై అభ్యంతరాలున్నా.. ఎన్నికల అధికారులు ప్రకటించే క్లెయిమ్స్‌, అభ్యంతరాల ప్రక్రియలో పాల్గొని, అవసరమైన ఆధారాలను సమర్పించటం ద్వారా ఓటు పదిలం చేసుకోవచ్చు.

 పురందేశ్వరికి కీలక పదవి వెనుక - మోదీ మార్క్ లెక్కలు..!!
పురందేశ్వరికి కీలక పదవి వెనుక - మోదీ మార్క్ లెక్కలు..!!
election-commission-issues-guidance-on-getting-vote-if-name-is-not-listed-in-draft-electoral-roll

ఓటర్లకు ఎన్నికల సంఘం సూచనలు

ఎన్నికల అధికారులు 2002 SIR తో ప్రస్తుత ఓటరు వివరాలు సరిగ్గా లేకపోవటంతో వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. వివాసం, అర్హతల ను నిర్ధారిస్తే సంబంధిత వ్యక్తి ఓటరుగా ఉండేందు కు అర్హుడని తేలితే ముసాయిదా జాబితాలో చేర్చుతారు. ఈఆర్‌వో, ఏఈఆర్‌వో నిర్ణయంతో సంతృప్తి చెందకపోతే ఉన్నతాధికారులకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడా ఓటు తిరిగి రాకపోతే.. ఓటరు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రెండో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా దరఖాస్తుల సమర్పణ, పేర్ల సవరణ, మార్పులు చేర్పులు, కొత్త ఓటరు నమోదుకోసం 17 నుంచి సెప్టెంబరు 16 వరకు అవకాశం కల్పించారు. ఎన్నికల అధికారులు జారీచేసే నోటీసులకు వివరణ ఇచ్చేందుకు 17 నుంచి అక్టోబరు 15 వరకు గడువు గా నిర్ణయించారు. ఇందు కోసం ఫారం-6, ఫారం-7, ఫారం-8 ను అందుబాటులో ఉంచారు. ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు ఓటరు గా చేరేందుకు అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+