ఎగ్జిట్ పోల్స్ కాదు: BJP- TMC అసలు లెక్క ఇదీ - అధికారం ఇక..!!

పశ్చిమ బెంగాల్ లో అధికారం ఎవరిది. ఎగ్జిట్ పోల్స్ వచ్చినా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్ తో ఎవరికి వారు తమకే అనుకూలంగా ఓటింగ్ జరిగిందని ధీమాగా చెబుతున్నారు. లోలోపల మాత్రం రెండు ప్రధాన పార్టీ ల్లోనూ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. హోరా హోరీ పోరు సాగిందని అంగీకరిస్తున్న ఈ రెండు పార్టీలు...తమ అంచనాలతో సిద్దమయ్యారు. అసలు విజేత ఎవరో స్పష్టత వచ్చేసింది. కాగా.. ఆ ఓటింగ్ ఇప్పుడు కీలకంగా మారుతోంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితం పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో భిన్నాభిప్రాయం వ్యక్తం అయింది. ఎగ్జిట్ పోల్స్ తో టీఎంసీ విభేదిస్తోంది. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూల మని బీజేపీ వాదిస్తోంది. టీఎంసీ ఖచ్చితంగా తమకే ప్రజలు మళ్లీ పట్టం కట్టారని చెబుతోంది. ఈ సమయంలోనే రెండు పార్టీలు రెండో విడత పోలింగ్ ముగిసిన తరువాత నియోజవకర్గాల వారీగా సరళి పైన క్షేత్ర స్థాయి సమాచారం సేకరించారు. ఓటర్లు సైలెంట్ గా ఇచ్చిన తీర్పు ఒక ప్రధాన పార్టీగా ఊహించని ఫలితంగా మారుతుందనే అంచనాకు వచ్చారు. 2021 ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే తరహాలో తమకే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేసింది. కౌంటింగ్ ప్రారంభంలోనూ బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కుతున్నట్లు ట్రెండ్స్ వచ్చాయి. చివరకు మమతకే ప్రజలు పట్టం కట్టారు. కాగా.. ఈ సారి మాత్రం ఓటర్లలో మార్పు కనిపిస్తుందని.. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమని బీజేపీ నేతలు నియోజకవర్గాల వారీగా విశ్లేషణలు చేస్తున్నారు.

 కల్తీ నెయ్యి అసలు దోషి ఆయనే - విచారణలో కీలక అంశాలు, ప్రభుత్వానికి నివేదిక..!!
కల్తీ నెయ్యి అసలు దోషి ఆయనే - విచారణలో కీలక అంశాలు, ప్రభుత్వానికి నివేదిక..!!
west-bengal-records-34-lakh-more-votes-than-2021-who-gains-from-the-turnout-surge

పెరిగిన ఓటింగ్ శాతం పైనే ఆశలు

ఇటు టీఎంసీ సైతం పోలింగ్ సరళిని సమీక్షించింది. గతం కంటే సీట్లు తగ్గినా.. అధికారం ఖాయం గా తమదే అని లెక్కలు వేస్తోంది. ఈ సమయంలో బీజేపీ అధినాయకత్వం బెంగాల్ పోలింగ్ సరళి పైన ఉన్నత స్థాయి సమీక్ష కు ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా.. 2021 ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువగా పోలయిన 34 లక్షల ఓట్లే గెలుపు ఓటములను డిసైడ్ చేసే అవకాశం ఉందని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 5.98 కోట్ల మంది ఓటు వేయగా, ఈసారి ఆ సంఖ్య 6.31 కోట్లకు చేరింది. గత ఎన్నికల్లో బీజేపీ కంటే టీఎంసీకి దాదాపు 60 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ 34 లక్షల ఓట్లు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా పడిన నిరసన ఓట్లుగా టీఎంసీ భావిస్తోంది. బీజేపీ మాత్రం తమ హామీలు.. మమత పాలన పైన వ్యతిరేకత.. బీజేపీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఈ స్థాయిలో ఓటింగ్ కు కారణాలు గా విశ్లేషిస్తోంది. దీంతో.. ఈ నెల 4న వెల్లడి కానున్న అసలు ఫలితాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+