తెలంగాణ సమస్య పరిష్కారమవుతుంది: బొత్సా సత్యనారాయణ

Bosta Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన తర్వాత తలెత్తిన సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం వెలువరిస్తుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను మార్చడం గానీ, రాష్ట్రపతి పాలన రావడం గానీ జరగదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందనే ప్రకటన వెలువడగానే నీళ్లు, తదితర సమస్యలు ఎలా పరిష్కారమవుతాయనే ఆందోళన తమ ప్రాంతాల్లో తలెత్తిందని ఆయన చెప్పారు. ఒక కుటుంబం విడిపోయే సందర్భంలోనే పంపకాల విషయంలో విస్తృత చర్చ జరుగుతుందని, అటువంటిది రాష్ట్ర విభజన అనే సరికి ఆందోళన మరింత ఉంటుందని, అయితే దానికి పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు.

తెలంగాణ సమస్య ఈనాటిది కాదని, ఆ సమస్య పరిష్కారానికి పార్టీ అధిష్టానం అన్ని ప్రాంతాల మనోభావాలను తెలుసుకుంటుందని ఆయన చెప్పారు. ఆవేదన, మనోభావాల వ్యక్తీకరణ వల్ల నష్టం జరగకూడదనేది తన ఉద్దేశమని ఆయన అన్నారు. అందరి మనోభావాలను తెలుసుకుని ఏకాభిప్రాయ సాధనకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కమిటీ వేశారని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని పార్టీ అధిష్టానానికి తెలియజేశామని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+