హైకమాండ్ తప్పుదారి పట్టింది: రాయపాటి

Rayapati Sambasiva Rao
గుంటూరు: తెలంగాణ విభజన జరగదన్న నమ్మకంతో ఇప్పటివరకు అధిష్ఠానాన్ని నమ్మి మో సపోయామని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానం వద్ద తమ వాణి వినిపించటంలో వెనుకబడ్డామన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ విభజన అంశం పెట్టినపుడు కూడా ఆ ప్రక్రియ జరిగే అవకాశంలేదని భావించి తేలిగ్గా తీసుకున్నామన్నారు.

తెలంగాణ ఏర్పా టు ప్రకటనకు కారణం తమ పార్టీకి చెందిన అగ్రనాయకులు కొందరు తెలంగాణ సీనియర్‌ నేతల ఒత్తిడికి లొంగడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరగదని, కంగారు పడాల్సిన పనిలేదని తమకు అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన వెంటనే అందుకు వ్యతిరేకంగా స్పందించిన కాంగ్రెస్ ఎంపీలలో రాయపాటి అగ్రగణ్యులు. సమైక్యాంధ్ర విషయమై ఆయన చాలాసార్లు సోనియా గాంధీని కలుసుకుని వివరించడానికి ప్రయత్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+