ఎల్లుండి సోనియా అభినందన సభ: జానారెడ్డి

Jana Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ నేతలు ఈ నెల 16వ తేదీన యుపిఎ చైర్ పర్సన్ కు అభినందన తెలుపుతూ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలు నిర్ణయం తీసుకున్నారు. వారంతా సోమవారం సమావేశమైన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మాజీ హోం మంత్రి, సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు కె. జానా రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన అందరు ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాలను, అన్ని తెలంగాణ సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెసు ద్వారానే సాధ్యమని తాము ఇచ్చిన హామీపై ప్రజలు అనుమానాలు, అపోహలు వ్యక్తం చేస్తూ వచ్చారని, వాటిని నివృత్తి చేస్తూ సోనియా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని, తమ హామీ అమలవుతోందని, ఈ స్థితిలో తాము సోనియా అభినందన సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

తెలంగాణ కోసం పార్టీలు, సంఘాలు వివిధ రూపాల్లో పోరాటాలు చేశాయని, జాతీయ పార్టీ కాంగ్రెసుకు చెందిన నాయకులుగా తమ పద్ధతుల్లో తాము తెలంగాణ కోసం వివిధ రూపాల్లో కృషి చేశామని ఆయన చెప్పారు. తమ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడానికి తాము వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేశామని ఆయన చెప్పారు. 2004 ఎన్నికల్లోనూ, 2009 ఎన్నికల్లో తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయాన్ని, దాన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నిర్ణయం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఆయన చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+