బాబు మార్చుకుంటే వేరు కుంపటి: ఎర్రబెల్లి

కాగా, తెలుగుదేశం తెలంగాణ శాఖను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటే తాము సహించబోమని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రత్యేక తెలంగామ రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే శాసనసభలో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే, తెలంగాణకు అనుకూలంగా ఇద్దరు తెలుగుదేశం శాసనసభ్యులు రాజీనామా చేశారు. రాజీనామా చేసినవారిలో చెన్నమనేని రమేష్ కూడా ఉన్నారు. ఇప్పటికే రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications