చిరంజీవిపై తెలంగాణ నేతల తిరుగుబాటు

సామాజిక తెలంగాణ నినాదాన్ని పార్టీ విడనాడకూడదని వారు వాదిస్తున్నారు. ఎలాగూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది కాబట్టి చిరంజీవి తటస్థంగా ఉంటే ఇక్కడ కూడా పార్టీ బలపడడానికి అవకాశం ఉంటుందనే వాదనను కూడా వినిపిస్తున్నారు. అయితే తెలంగాణేతర నాయకుల నుంచి చిరంజీవిపై ఒత్తిడి పెరుగుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా శాఖ తీర్మానం చేసి చిరంజీవికి పంపుతున్నట్లు శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు తెలిపారు.












Click it and Unblock the Notifications
