బ్రిటన్ పౌరసత్వంతో ఐపీఎల్‌కు లైన్ క్లియర్.. క్లారిటీ ఇచ్చిన పాక్ స్టార్!

పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్‌లో ఆడనున్నారనే వార్తలకు తెరపడింది. బ్రిటీష్ పౌరసత్వం పొందిన తర్వాత మహమ్మద్ ఆమిర్ ఐపీఎల్ 2027 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ అంచనాలన్నింటికీ స్వయంగా మహమ్మద్ ఆమిరే చెక్ పెట్టారు. తాను ఐపీఎల్ వేలంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య ఇదేనా?
Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య ఇదేనా?

'వేలంలో నా పేరు నమోదు చేసుకోవడం లేదు'
34 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ పేసర్ రాబోయే ఐపీఎల్ వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు క్రిక్‌‌బజ్ కథనం వెల్లడించింది. దుబాయ్ నుంచి క్రిక్‌బజ్‌కు పంపిన సందేశంలో మహమ్మద్ ఆమిర్ ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు. 'నేను ఐపీఎల్ వేలానికి నా పేరును రిజిస్టర్ చేసుకోవడం లేదు' అని మహమ్మద్ ఆమిర్ స్పష్టం చేశారు.

Will Mohammad Amir Play IPL 2027 Former Pakistan Pacer Clarifies UK Citizenship Rumours Details

బ్రిటీష్ పౌరసత్వంతో ఊపందుకున్న ప్రచారం
పాకిస్థానీ ఆటగాళ్లపై ఐపీఎల్‌లో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహమ్మద్ ఆమిర్‌కు మే 2026లో బ్రిటీష్ పౌరసత్వం లభించింది. దాంతో ఆయన ఇంగ్లాండ్ పౌరుడిగా ఐపీఎల్ ఆడేందుకు మార్గం సుగమమైందని వార్తలు వినిపించాయి. పాక్ మాజీ ఆల్‌రౌండర్ అజహర్ మహమూద్ కూడా గతంలో యూకే పౌరసత్వం సాధించిన తర్వాత 2012 నుంచి 2015 వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల తరఫున ఐపీఎల్‌లో ఆడారు. దీంతో మహమ్మద్ ఆమిర్ కూడా అదే బాటలో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తారని అభిమానులు భావించారు. కానీ ఆయన మాత్రం ఐపీఎల్‌కు దూరంగా ఉండటానికే మొగ్గు చూపారు.

Ind vs New Zealand: ఐదో టీ20లో ఆరంభంలోనే అభిషేక్, శాంసన్ ఔట్..ఆ తర్వాత..!
Ind vs New Zealand: ఐదో టీ20లో ఆరంభంలోనే అభిషేక్, శాంసన్ ఔట్..ఆ తర్వాత..!

ఇంగ్లాండ్ కౌంటీ, ఇతర లీగ్‌లలో రచ్చ
ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున.. అలాగే ది హండ్రెడ్ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ తరఫున మహమ్మద్ ఆమిర్ స్థానిక ఆటగాడిగానే బరిలోకి దిగారు. అంతేకాకుండా అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్ లో ప్లాటినమ్ కేటగిరీలో బ్రిటీష్ పౌరుడిగా తన పేరును నమోదు చేసుకున్నారు.

పీఎస్ఎల్ లో కూడా విదేశీ ఆటగాడిగానే..!
వచ్చే ఏడాది జరగబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో కూడా తాను తిరిగి ఆడనున్నట్లు మహమ్మద్ ఆమిర్ ప్రకటించారు. అయితే ఈసారి ఆయన పాకిస్తాన్ స్థానిక ఆటగాడిగా కాకుండా విదేశీ ప్లేయర్ కేటగిరీలో బరిలోకి దిగడం విశేషం. కాగా 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మహమ్మద్ ఆమిర్ పాకిస్తాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచులు ఆడారు. 2009 టీ20 ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్ జట్లలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+