"24 గంటలు గడిచిపోయాయి మోడీ జీ"-! ఇప్పటికైనా రండి- రాహుల్ సవాల్..!
విదేశీ శక్తుల సాయంతో దేశాన్ని ముక్కలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోడీ చేసిన ఆరోపణలపై చర్చకు రావాలంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సవాల్ విసిరారు. అయితే ప్రధాని మోడీ మాత్రం 24 గంటలైనా స్పందించకపోవడంపై రాహుల్ మరో ట్వీట్ చేశారు. ఇందులో మోదీ జీ, 24 గంటలు గడిచిపోయాయి, ప్రతిపక్షం దేశద్రోహి అని మీరు చేసిన వ్యాఖ్యలపై చర్చకు ఏదైనా వేదికను, స్థలాన్ని ఎంచుకోవాలని, తనతో చర్చకు రావాలని రాహుల్ మరోసారి కోరారు. అసలు దేశద్రోహి ఎవరు? విదేశీ శక్తులతో ఎవరికి సంబంధాలు ఉన్నాయి? ఆ సంబంధాలు ఎలాంటివి? అని ప్రశ్నించారు. ఆలస్యం చేయకండి, త్వరగా రండి, భయపడకండి అంటూ మోడీకి చురకలు అంటించారు.
మనం ఇద్దరం అక్కడ ఉంటాం, మీడియా ఉంటుంది, దేశ యువత ఉంటుంది. ఒక టేబుల్ ఉంటుంది, ఒక వైపు మీరు కూర్చుంటారు, మరో వైపు నేను కూర్చుంటాను. మీరు ఎవరిని న్యాయనిర్ణేతగా నియమించాలనుకుంటున్నారో, వారిని తీసుకురండి. కావాలంటే మోహన్ భగవత్ జీని ఆ కుర్చీలో కూర్చోబెట్టండి, రండి, మనం చర్చిద్దామంటూ రాహుల్ ప్రధాని మోడీకి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నిర్మాణం, అమెరికాతో ఒప్పందం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇంత వేగంగా ఎందుకు జరిగింది, మీరు ఒక్కరే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, క్యాబినెట్‌కు ఎందుకు చెప్పలేదు, ఎప్ స్టీన్ వ్యవహారం, ఇలాంటి అనేక అంశాలపై బహిరంగంగా చర్చిద్దామన్నారు. పాలల్లో నీళ్లు కలిపితే ఎలా వేరు చేస్తారో, అలా నిజానిజాలను తేల్చేద్దామన్నారు.

నాపై ఆరోపణలు చేస్తున్నారు కదా? రండి, అన్నీ స్పష్టమవుతాయని ప్రధానికి రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఇతర విషయాల్లో అయితే నాపై పరువు నష్టం దావాలు వేశారు, బహుశా నాపై సుమారు 45 పరువు నష్టం దావాలు ఉన్నాయన్నారు. కానీ ఈ చర్చా అంశంపై, విదేశీ సంబంధాల విషయంలో మాత్రం మీరు ఎందుకు పరువు నష్టం దావా వేయడం లేదన్నారు. వేయండి చూద్దాం, దానిపై కూడా బహిరంగంగా చర్చిద్దాం. రండి, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం అన్నారు. చివరిగా ప్రధాని మోడీకి దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు.













Click it and Unblock the Notifications
