ఐటీ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్..!

మురసు తుపాను ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మురసు తుపాను ఈ అర్ధరాత్రి తెలంగాణను తాకనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇక ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, నల్గొండకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు అధికారులు.

ముఖ్యంగా ఈ నెల 4(బుధవారం), 5(గురువారం) తేదీల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న నేపథ్యంలో సైబ‌రాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు కీలక సూచనలు చేశారు. భీకర వర్షాల కారణంగా ట్రాఫిక్ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఐటీ ఉద్యోగులు త్వ‌ర‌గా లాగౌట్ కావాల‌ని సూచనలు చేశారు. వీలైతే మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ద‌శ‌లవారీగా లాగౌట్ కావాల‌ని పోలీసులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో త్వ‌ర‌గా లాగౌట్ అయితే ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉద్యోగులు సుర‌క్షితంగా ఇంటికి చేరుకోవ‌చ్చని పోలీసులు స్పష్టం చేశారు. వీలైతే ఐటీ కంపెనీలు త‌మ ఉద్యోగ‌స్తుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వెసులుబాటు క‌ల్పించాల‌ని పోలీసులు సూచనలు చేశారు.

techies should log out early tomorrow and day after Due to the rains advice from Cyberabad Police

వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అవుతుంటాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉంటుంది. ఈ క్రమంలో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడం, రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని నియంత్రించడం ఈ సూచనల ప్రధాన ఉద్దేశమని పోలీసులు వెల్లడించినట్లు స్పష్టం అవుతోంది. ఇక వాతావరణ శాఖ తాజాగా అందించిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్, బేగంపేట, హిమాయత్‌ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+