చిరు పార్టీకి ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి రాజీనామా

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సామాజిక తెలంగాణ అంటూ తెలంగాణకు ఇంతకు ముందు మద్దతు తెలిపారని, ఇప్పుడు మాట మార్చి తెలంగాణ పేద, బడుగు వర్గాల ఆశయాలను తుంగలో తొక్కి సమైక్యాంధ్ర బాట పట్టారని ఆయన అన్నారు. చిరంజీవి మహా నటుడని మరోసారి రుజువు చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా మహేశ్వర రెడ్డి చిరంజీవి వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ఏం చాక్లెట్ ఇచ్చారో తెలియదు గానీ చిరంజీవి సమైక్యాంధ్ర మంత్రం ఎత్తుకున్నారని ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications