మహబూబ్ నగర్: మహారాష్ట్రలోని తుల్జాపూర్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మహబూబ్ నగర్ నుంచి షీర్డీ వెళ్తున్న జీపు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
మృతులు మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందినవారు. జీపులో షిర్డీకి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి