ఆంధ్రలో మళ్లీ ఎన్నికలు: చిదంబరం హెచ్చరిక

Chidambaram
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కోస్తాంధ్ర, రాయలసీమ పార్లమెంటు సభ్యులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే పద్ధతి కొనసాగితే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు పెడ్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మనసు మార్చడానికి కోస్తాంధ్ర, రాయలసీమ పార్లమెంటు సభ్యులు గురువారం చిదంబరాన్ని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై తాము చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని, అయితే శాసనసభలో తీర్మానం లేకుండా ముందుకు సాగబోమని ఆయన చెప్పారు. అయినా వినకుండా స్పష్టమైన ప్రకటనే చేయాలని వారు కోరినట్లు తెలిసింది. అయితే అందుకు చిరాకు పడిన చిదంబరం - ముందు రాష్ట్రంలో పరిస్థితులు చక్కబరచడానికి సహకరించండి, ఆందోళనలు ఆగేలా చూడండి, అప్పుడు ప్రశాంతంగా అందరం కూర్చుని మాట్లాడుకోవచ్చు అని ఆయన చెప్పారు.

శాసనసభలో తీర్మానం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ముందుకు కదలబోమని, అయితే ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి చెందిన రాయలసీమ, కోస్తాంధ్ర శానససభ్యులు, ఎమ్మెల్సీలతో ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ముందు ప్రజలకు నచ్చజెప్పి ప్రశాంత వాతావరణానికి తోడ్పడితే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చునని ఆయన చెప్పినట్లు సమాచారం. అది ప్రజా ఉద్యమమని వారు చెప్పినప్పుడు దాని వెనక ఎవరున్నారో తెలుసునని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+