ఇండోర్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ప్రొఫెసర్ క్యాంపస్ ఆవరణలో కత్తిపోట్లకు గురై మరణించింది. ఆమె మృతదేహం క్యాంపస్ లో శుక్రవారం ఉదయం కనిపించింది. 32 ఏళ్ల అమ్రత పంచోలి క్యాంపస్ ఆవరణలో గల క్వార్టర్స్ లో శవమై కనిపించింది. ఆమె శరీరంపై కత్తితో పొడిచిన గాయాలున్నాయి. ఇతర గాయాలు కూడా ఉన్నాయి.
శుక్రవారం ఉదయం సెక్యూరిటీ గార్డులు, ఇతర గస్తీ సిబ్బంది అనుమానం వచ్చి ఆమె క్వార్టర్ లో చూశారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు ఆమె క్వార్టర్ ను సీల్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయితే ఆమె మరణంపై పోలీసులు నోరు మెదపడం లేదు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి