మే నెలలో అదృష్టం మేషం, వృషభం, సింహం, మీనరాశులవారిదే
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు కేవలం ఖగోళ మార్పులు మాత్రమే కాదు, అవి మానవ జీవితాలను మలుపు తిప్పే శక్తి సంకేతాలు అని చెప్పొచ్చు. ముఖ్యంగా 2026 మే నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వంటి కీలక గ్రహాల కలయికతో విశ్వంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఈ సంచారం వల్ల అరుదైన 'బుధాదిత్య రాజయోగం', 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏకకాలంలో ఏర్పడుతున్నాయి. ఈ శక్తివంతమైన యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారి తలరాతే మారిపోబోతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలుసుకున్నప్పుడు ఏర్పడే బుధాదిత్య రాజయోగం అపారమైన మేధస్సును, వ్యాపార దక్షతను ప్రసాదిస్తుంది. ఇక బుధుడు, శుక్రుడు కలిసినప్పుడు పుట్టుకొచ్చే లక్ష్మీనారాయణ రాజయోగం ఆ ఇంట్లో సిరిసంపదలను కురిపిస్తుంది. ఈ రెండు రాజయోగాల వల్ల కీర్తి ప్రతిష్టలతో పాటు సమాజంలో తిరుగులేని గౌరవం లభించనుంది. ఏయే రాశులకు కలిసిరానుందనే వివరాలను తెలుసుకుందాం.

మేష రాశి: ఆర్థిక స్థిరత్వం
మేష రాశి వారికి ఈ నెల ఒక వరంలా మారబోతోంది. గతంలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, సంతోషం రెట్టింపు అవుతాయి.
వృషభ రాశి: వ్యాపారంలో ఘనవిజయాలు
లక్ష్మీనారాయణ యోగం వృషభ రాశి వారికి అద్భుతమైన 'బిజినెస్ డీల్స్'ను తెచ్చిపెడుతుంది. కొత్త బిజినెస్ పార్టనర్స్ తో ఒప్పందాలు కుదురుతాయి. ఇవి మీ వ్యాపారాన్ని తర్వాత స్థాయికి తీసుకెళ్తాయి. ఆఫీసులో ప్రమోషన్ తో పాటు భారీగా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది.
సింహ రాశి: ఆత్మవిశ్వాసం ఎక్కువ
సింహ రాశి వారిలో ఈ నెల ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. ఉన్నతాధికారుల అండదండలతో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ చకచకా పూర్తవుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది, ఆర్థికంగా కూడా స్థితిగతులు మెరుగుపడతాయి.
మీన రాశి: విదేశాలకు వెళతారు
మీన రాశి వారికి ఈ సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. గ్రీన్‌కార్డ్ లేదా వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది.












Click it and Unblock the Notifications