డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ టాలీవుడ్ హీరో: అసలు ఆ పగ ఏంటి?

Gayapadda Simham Movie Review: ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో కొత్త కథలతో ప్రయోగాలు చేయడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా.. జేడీ చక్రవర్తి కీలక పాత్రలో, కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త క్రైమ్ కామెడీ చిత్రం ఈ 'గాయపడ్డ సింహం'. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మన హైదరాబాద్ హీరో పగ తీర్చుకోవాలనుకుంటే ఎలా ఉంటుంది? అనే ఒక క్రేజీ అండ్ సిల్లీ పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించిందో పూర్తి రివ్యూలో చూద్దాం!

స్టోరీ
ఐజీ విజయకాంత్ (శుభలేఖ సుధాకర్) ఆధ్వర్యంలో హర్షవర్ధన్‌తో కూడిన పోలీసుల బృందం నగరంలోని డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతుంది. ఇదే క్రమంలో విజయకాంత్ తన కూతురు (ఫరియా అబ్దుల్లా)కి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. ఈ పెళ్లి చూపులకి హీరో తరుణ్ భాస్కర్ వస్తాడు. ఇద్దరికీ పెళ్లి కుదురుతుంది. అయితే తన తండ్రికి, కాబోయే భర్తకు మధ్య ఏదో పాత పరిచయం ఉందని గ్రహించిన ఫరియా.. అసలు నిజం చెప్పమని తన తండ్రిని కోరుతుంది. అప్పుడు కేజీఎఫ్ తరహాలో శుభలేఖ సుధాకర్ ఓ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్ మొదలుపెడతాడు.

Gaayapadda Simham Movie Review Tarun Bhascker vs Donald Trump Comedy Falls Short but Entertains

ఆ ఫ్లాష్‌బ్యాక్ ఏంటంటే..
హీరో తరుణ్ భాస్కర్ ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించి, తన లవర్ (మానస చౌదరి)ని పెళ్లి చేసుకోవాలని అమెరికా బయల్దేరుతాడు. కానీ, అమెరికా వెళ్లిన వాడు వెళ్లినట్టే వెనక్కి తిరిగి వస్తాడు. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల డిపోర్ట్ అయిన భారతీయ విద్యార్థుల్లో మన హీరో ఒకడు. దీంతో తిరిగి ఇండియా వచ్చిన తర్వాత ట్రంప్ మీద తీవ్రమైన పగ పడతాడు. 'నేను గాయపడ్డ సింహాన్ని.. ప్రతీకారం తీర్చుకుంటా' అంటూ స్నేహితులతో చెబుతుంటాడు. అసలు ట్రంప్ మీద ఓ సామాన్య కుర్రాడు పగ తీర్చుకోవడం సాధ్యమా? ఈ క్రేజీ పాయింట్‌కి మాఫియా డాన్ బ్రూటల్ ధర్మా (జేడీ చక్రవర్తి)కి ఉన్న లింక్ ఏంటి? అలాగే మంత్రతంత్రాలు నమ్మే తండ్రితో గొడవపడి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న శ్రీవిష్ణు కథ ఈ ప్రయాణంలో ఎలా మలుపు తిరిగింది? అనేదే మిగతా సినిమా.

ఎలా ఉందంటే?
క్రైమ్ కామెడీ సినిమాలకు పెద్దగా లాజిక్‌లు వెతకకూడదు, చూసినంత సేపు నవ్వుకుంటే చాలు. ఈ సినిమాలో కూడా ట్రంప్ మీద హీరో పగ తీర్చుకోవాలనుకునే ఆ సిల్లీ పాయింట్‌లోనే కావాల్సినంత కామెడీ పుట్టింది. అందరికీ సిల్లీగా అనిపించే విషయాన్ని హీరో చాలా సీరియస్‌గా తీసుకోవడం బాగుంది. అయితే, కథనం చాలా నెమ్మదిగా సాగడం వల్ల సినిమా ముందుకు సాగకుండా అక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అందులోనూ వచ్చే పాటలు కథకు అడ్డం తగిలి బ్రేకులు వేస్తూ ఉంటాయి. ద్వితీయార్థంలో కామెడీ, కొన్ని పంచ్‌లైన్లు అక్కడక్కడా బాగానే నవ్విస్తాయి.

నటీనటుల పనితీరు:
తరుణ్ భాస్కర్ ఈ తరహా కామెడీని తన గత సినిమాల్లోనే చేసేశారు. 'కీడా కోలా' తరహా పదాల గారడి, వాక్యాలను విరిచి ఫన్ చేయడం ఇందులోనూ రొటీన్‌గా అనిపిస్తుంది. అన్ని సినిమాలు 'జాతిరత్నాలు' కాలేవు కదా! ఆ మ్యాజిక్ ఇక్కడ పూర్తిగా రిపీట్ కాలేదు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జేడీ చక్రవర్తి గురించి. 'బ్రూటల్ ధర్మా' అనే విలన్ వేషంలో ఆయన కొత్తగా కనిపించారు. అయితే ఆ పాత్రను పూర్తిస్థాయి కామెడీగా మార్చడంలో దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ అంతగా సఫలం కాలేదు. 'దిల్లీ బెల్లీ' తరహా కామెడీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది. చక్రవర్తి సైకియాట్రిస్ట్‌ను కలవడం 'ఎనలైజ్ దిస్' అనే హాలీవుడ్ సినిమాను గుర్తు చేస్తుంది. క్యామియో కంటే కొంచెం పెద్ద పాత్రలోనే శ్రీవిష్ణు నటించాడు. ఈ పాత్ర కథకు చాలా కీలకం. కానీ ఈ క్యారెక్టర్ కొంచెం తికమకగా ఉంటుంది. కామెడీగా సాగే కథలోకి మంత్రతంత్రాలు లాంటి సీరియస్ విషయాలు రావడంతో ప్రేక్షకుడు కాస్త కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఫరియా అబ్దుల్లా, శుభలేఖ సుధాకర్, కృష్ణభగవాన్, హర్షవర్ధన్ ఉన్నా ఎవరికీ పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు.

ప్లస్ పాయింట్స్:
తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి నటన ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అక్కడక్కడా కామెడీ అద్భుతంగా పేలింది. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సెకండాఫ్. సెకండాఫ్ అభిమానులను ఆకట్టుకునేలా తీశారు.

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ లో కథాంశం స్లోగా సాగుతుంది. ఉడికీ ఉడకని కథ, కథనంతో దర్శకుడు ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేశాడు. సీరియస్ అంశాల వల్ల తికమక జరిగింది.

ఫైనల్‌గా..
మొత్తంగా చెప్పాలంటే.. 'గాయపడిన సింహం' పెద్దగా అంచనాలు లేకుండా ఓసారి చూడదగ్గ క్రైమ్ కామెడీ చిత్రం. అయితే టైటిల్‌కు తగ్గట్టుగానే కొన్నిసార్లు ఆ 'గాయపడిన సింహం' ప్రేక్షకులను కూడా కాస్త గాయపరిచే ప్రయత్నమే చేసింది.

రేటింగ్ : 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+