నేను అందరివాడిని: విశాఖలో చిరంజీవి

తెలంగాణ ఉద్యమం బలంగా లేదని, దాన్ని కొంత మంది స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. అన్ని పార్టీలవారు సమైక్యాంధ్ర కోసం నిలపడుతున్నారని ఆయన అన్నారు. కొందరు స్వార్థపరులైన వేర్పాటువాదుల వల్లనే సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. 2004లో కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుందని, ప్రస్తుత సమస్యకు కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన శుక్రవారం తిరుపతిలో పర్యటించి సాయంత్రం చెన్నై వెళ్లారు. అక్కడి నుంచి ఆయన శనివారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు.












Click it and Unblock the Notifications