ప్రియుడి కోసం భర్తను చంపి మహారాష్ట్ర సరిహద్దుల్లో పాతిపెట్టిన మహానటి ఏం చేసిందంటే!
భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు ఇటువంటి హత్యల వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న భర్త నరాలలోకి సిరెంజీతో హార్పిక్ ఎక్కించి ఒక భార్య ప్రాణాలు తీస్తే, తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో మరొక దారుణమైన హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.
భర్తను చంపి మహారాష్ట్ర సరిహద్దుల్లో పాతిపెట్టిన భార్య
ప్రియుడి కోసం భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన భార్య, ఆ మృత దేహాన్ని మహారాష్ట్ర సరిహద్దులకు తరలించి పాతిపెట్టడం, ఆపై భర్త కనిపించటం లేదని పోలీసుల వద్ద మిస్సింగ్ కేసు నమోదు చేయటం హైదరాబాద్ లో కలకలం రేపింది. గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు సుదీర్ఘంగా తయారు చేసి తాజాగా అనేక కీలక అంశాలను బయట పెట్టారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపి పాతిపెట్టిన ఇల్లాలు
మియాపూర్ కు చెందిన ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. దీంతో భార్య వేరే వ్యక్తితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తుంది. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసి ఆ మృత దేహాన్ని రహస్యంగా వాహనంలో తీసుకెళ్లి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భూమిలో పాతిపెట్టారు.
భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు
ఇలా చేస్తే ఎవరికీ అనుమానం రాదని భావించారు. హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత భార్య మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి భర్త కనిపించటం లేదని ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదని పేర్కొంది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మొదట్లో సాధారణ మిస్సింగ్ కేసుగా భావించినా, తర్వాత భార్య ప్రవర్తనలో కొన్ని విషయాలు అనుమానాస్పదంగా కనిపించాయి.
ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఇల్లాలు కథ బయట పడిందిలా
భర్త మొబైల్ కాల్ రికార్డులు, భార్య కాల్ హిస్టరీని పరిశీలించగా, ఆమె ఒక నిర్దిష్ట వ్యక్తితో తరచూ సంభాషించినట్లు గుర్తించారు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరూ కలిసి హత్యకు పాల్పడినట్లు అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయగా ఇద్దరూ కలిసి హత్యకు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు నుండి బయటకు తీసి హైదరాబాద్‌కు తరలించనున్నారు. ఈ ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది.













Click it and Unblock the Notifications