"ద్రోహి.. ఎంతకు అమ్ముడుపోయావ్?"- తృణమూల్ రెబెల్ ఎంపీకి జనం తొలి షాక్..!
పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారి పార్టీని వీడి వెళ్లిపోయారు. వీరి ప్రభావంతో పార్టీలో మిగిలిన వారు కూడా వెళ్లిపోయేలా ఉన్నారు. మరోవైపు బీజేపీ ప్రోద్భలంతో అసలు టీఎంసీ నాయకులపై కోడిగుడ్ల దాడులు కొనసాగుతున్నాయి. వీటిపై స్వయంగా కలకత్తా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ను వీడిన రెబెల్ ఎంపీ సయోనీ ఘోష్ (Saayoni Ghosh) కు ఇవాళ జనం షాకిచ్చారు. బరుయ్ పూర్ లో ఓ మైనర్ బాలిక రేప్, దారుణ హత్యకు గురైన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బరుయ్ పూర్ కు వెళ్లిన తృణమూల్ రెబెల్ సయోనీ ఘోష్ కు జనం నినాదాలతో స్వాగతం పలికారు. అయితే అవి మద్దతుగా కాదు వ్యతిరేకంగా. ద్రోహి, ఎంతకు అమ్ముడుపోయావంటూ సయోనీ ఘోష్ ను జనం ప్రశ్నిస్తూ వెంబడించారు. దీంతో ఆమె వెంటవెంటనే పరామర్శ పూర్తి చేసుకుని బయల్దేరి వెళ్లిపోయారు.

Sayoni Gosh was welcomed with “Beimaan” and “for how much you got sold” slogans in Baruipur, West Bengal.
— Shantanu (@shaandelhite) July 7, 2026
BJP has left them nowhere by making them join NCPI. BJP-Modi will use them till 2029 to pass bills after that they’ll be nowhere. pic.twitter.com/E2rXFyqel2
ఇప్పటివరకూ తృణమూల్ నేతలపై కోడిగుడ్ల దాడులు చేయించిన అధికార బీజేపీకి ఈ పరిణామం మింగుడు పడటం లేదు. టీఎంసీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల్ని చీల్చి తమవైపు తిప్పుకుంటున్న బీజేపీకి అప్పుడే వీరిపై జనాగ్రహం వ్యక్తం కావడంతో సువేందు అధికారి ప్రభుత్వం ఇరుకునపడింది. అయితే వెంటనే దీనిపై ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ స్పందించలేదు. అలాగే సయోనీ ఘోష్ కూడా ఏమీ జరగనట్లుగా సైలెంట్ గా ఉన్నారు. కానీ బరుయ్ పూర్ లో సయోనీ ఘోష్ కు తగిలిన నిరసనల సెగ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














Click it and Unblock the Notifications