లగడపాటికి కామెర్లు: వైద్యుర్థుల నిర్ధారణ

Lagadapati Rajagopal
విజయవాడ: సమైక్యాంధ్ర నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కామెర్లతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఆయనను దీక్షా శిబిరం నుంచి పోలీసులు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. లగడపాటి రాజగోపాల్ ను మంత్రి పార్థసారథి శనివారంనాడు పరామర్శించారు. లగడపాటితో ప్రభుత్వం తరఫున పార్థసారథి, జాయింట్ కలెక్టర్ చర్చలు జరిపారు.

లగడపాటి రాజగోపాల్ రెండు డిమాండ్లు పెడుతున్నట్లు ఆయన తరఫున మాజీ శాసనసభ్యుడు జయప్రకాష్ రెడ్డి చెప్పారు. తనకు దీక్షా శిబిరం వద్దనే చికిత్స అందించాలని లేదా హైదరాబాదులోని నిమ్స్ కు తరలించాలని లగడపాటి డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేయడంపై లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+