న్యూఢిల్లీ: లోకసభలో ప్రతిపక్ష నేత పదవికి బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పదవిని బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ చేపట్టారు. అద్వానీ ప్రతిపక్ష నేతగా రాజీనామా చేస్తారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఘోరంగా పార్టీ విఫలమైన నేపథ్యంలో పార్టీలో తీవ్ర విభేదాలు పొడసూపాయి. నాయకత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత పదవిని చేపట్టడానికి అద్వానీ తొలుత నిరాకరించారు. అయితే ఒత్తిడి మేరకు ఆ పదవిని చేపట్టారు.
పార్టీలో లుకలుకలు ప్రారంభమై తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంది. ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ పార్టీ నాయకత్వం మారాలని సూచించారు. దీంతో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ప్రతిపక్ష నేతగా అద్వానీ తప్పుకుంటారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఆ మేరకు అద్వానీ ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి