'గోబీ మంచూరియా'.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!
సాధారణంగా మంచూరియా అనగానే చాలామందికి నోరూరుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మంచూరియాను తింటుంటారు. ఇంట్లో చేసుకోవడానికి చాలా మంది ఎందుకో ఆసక్తి చూపించరు. ఇంకొంత మందికి ఎలా చేసుకోవాలో తెలియదు. ఈ క్రమంలో ఇంట్లోనే ఈజీగా తక్కువ పదార్థాలతో గోబీ మంచూరియాను ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
గోబీ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా గోబీ(కాలీఫ్లవర్) ఒకటి మధ్య పరిమాణం(ముక్కలు చేసినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కారం రెండు టేబుల్ స్పూన్ లు, సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, టమాటో సాస్ రెండు టేబుల్ స్పూన్ లు, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ అర కప్పు, మైదా పావు కప్పు, వెనిగర్ ఒక టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్ లు, నూనె వేయించడానికి సరిపడా, నీరు అవసరమైనంత తీసుకోవాలి.

గోబీ మంచూరియా తయారీ విధానం చూస్తే ముందుగా గోబీ ముక్కలను కడిగి, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు , కొద్దిగా నీరు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ముక్కలను పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా వేగిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో కొద్దిగా నూనె వేయాలి. ఆ తర్వాత సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. సాస్ లో వేయించిన గోబీ ముక్కలను వేసి బాగా కలపాలి. అంతే గోబీ మంచూరియా రెడీ అయినట్టే.. ఇప్పుడు వేడి వేడిగా గోబీ మంచూరియాను సర్వ్ చేసుకోవడమే..












Click it and Unblock the Notifications