కేప్టెన్ సాబ్ కు ముంబై ఇండియన్స్ తో చెడిందా- అన్ ఫాలో కొట్టిన హార్దిక్ పాండ్యా?

ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడంటూ వార్తలు వెల్లువెత్తాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం రాత్రి రాయ్ పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మట్టికరిచిన అనంతరం ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. మేనేజ్మెంట్ కు హార్దిక్ పాండ్యా మధ్య విభేదాల చోటు చేసుకున్నాయనే పుకార్లకు తెర తీసింది.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఓటమి తర్వాత కొంతసేపు హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తాను ఫాలో అవుతున్న అకౌంట్ల సంఖ్య 150గా కనిపించింది. ఆ 150 మంది ఉన్న జాబితాలో ముంబై ఇండియన్స్ అకౌంట్ కనిపించలేదు. దీంతో ఈ పుకార్లు చురచుర అంటూ అంటుకున్నాయి. హార్దిక్ ఫాలోయింగ్ లిస్ట్ నుండి ముంబై ఇండియన్స్ ఖాతా మిస్సైనట్లు చూపిస్తున్న స్క్రీన్‌షాట్‌లను అనేక మంది సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు.

Hardik Pandya Instagram Unfollow Sparks Mumbai Indians Fallout After Exit From Playoffs Heats Up

కొన్ని నిమిషాల వ్యవధిలోనే హార్దిక్ పాండ్యా ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య మళ్లీ 151 కి మారడాన్ని అభిమానులు గుర్తించారు. పాండ్యా ఫాలో అవుతున్న అకౌంట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ కనిపించింది. ఇది టెక్నికల్ ఎర్రరా, అనుకోకుండా జరిగిందా లేక ఓటమి తర్వాత కలిగిన నిరాశ వల్లనా అనేది తెలియరావట్లేదు. ఈ ఘటనపై హార్దిక్ పాండ్యా గానీ, ముంబై ఇండియన్స్ గానీ అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

కొన్ని నిమిషాల పాటే అయినా వైరల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యక్తిగతంగా హార్దిక్ పాండ్యా కూడా ఈ సీజన్‌లో నిరాశపరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదు. కేప్టెన్ గా కూడా విఫలం అయ్యాడీ ఆల్ రౌండర్. ఈ ఏడాది ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 146 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు వికెట్లే పడగొట్టాడు. వెన్నెముక సమస్యల కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరం కావడం మరింత దెబ్బతీసింది.

2024 ఐపీఎల్ సీజన్ కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో రీఎంట్రీ ఇచ్చాడు కెప్టెన్‌గా. అంతకుముందు రెండు సీజన్లల్లో గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వాన్ని వహించాడు. తొలి సీజన్ లో ఛాంపియన్ గా నిలపడం, మరుసటి ఏడాది ఆ జట్టును ఫైనల్స్ కు చేర్చడం దీనికి ప్రధాన కారణాలు. అతని కేప్టెన్సీ టాలెంట్ కు ఫిదా అయిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. పాండ్యాను వెనక్కి పిలిపించుకుంది. సారథిగా పగ్గాలు అప్పగించింది గానీ పెద్దగా ఫలించలేదా స్ట్రాటజీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+