తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టిన విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కించపరిచారని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా విమర్శించారు. కెసిఆర్ వ్యాఖ్యలు విద్యార్థులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆమె అన్నారు. సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న విద్యార్థుల శిబిరాన్ని ఆమె సందర్శించి తన సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ రాజధాని కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చారని, అలా వచ్చినవారిని దొంగలూ ద్రోహులూ అనడం సరి కాదని, కర్నూలో, విజయవాడనో రాజధాని అయితే అక్కడికే వెళ్లి ఉండేవారని ఆమె అన్నారు. కెసిఆర్ తన ధోరణి మార్చుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను తెలుసుకుందామని, అలాగే వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను కూడా తెసుకుందామని, ఇలా అందరి మనోభావాలను తెలుసుకుని ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఆమె అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్గికి పెద్దలు, మేధావులు కూర్చుని ఆలోచన చేయాలని ఆమె సూచించారు. సమైక్యంగా ఉండి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదని ఆమె అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి