భయంతో లగడపాటి పారివచ్చారు: దామోదర్

R Damodar Reddy
హైదరాబాద్: దీక్ష విరమిస్తే మీద పడతారనే భయంతో తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు పారిపోయి వచ్చారని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధేయవాదినని చెప్పుకునే లగడపాటికి దీక్ష చేయడానికి స్థలం ముఖ్యం కాదని, ఎక్కడైనా దీక్ష చేయవచ్చునని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. లగడపాటి హై డ్రామా వెనక ఎవరి హస్తం ఉందో విచారణలో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లగడపాటి డ్రామా వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అనుమానించారు. ఉద్రేకాలు తెచ్పి పెట్టే ఉద్దేశంతోనే లగడపాటి ఇక్కడికి వచ్చారని ఆయన అన్నారు.

పార్లమెంటు సభ్యుడిగా లగడపాటి ఇక్కడికి వస్తే ఫరవా లేదని, ఉద్యమకారుడిగా రావడం వల్లనే అభ్యంతరం చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణలో లగడపాటిని ఉంచకూడదని, వేరే ప్రాంతానికి తరలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సినిమా షూటింగ్ లా లగడపాటి ఉద్యమం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటి 300 కిలోమీటర్లు ప్రయాణించి వస్తే కనిపెట్టలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆయన విమర్శించారు. పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటి ఆరోగ్యం గురించి చెప్పాల్సింది వైద్యులేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+