రాజగోపాల్ విశాఖ వెళ్తున్నట్టు వదంతులు

లగడపాటి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యసేవల నిమిత్తం మంగళగిరి తీసుకువెళ్తుండగా ఆయన తప్పించుకున్నారు. హైదరాబాద్ కు గానీ, విశాఖగానీ వెళ్లే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. కింగ్ జార్జి అసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడంతో విశాఖ వచ్చేందుకే అవకాశం ఎక్కువుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడి అభిమానులు, రాజకీయనాయకులు ఆయన రాక కోసం ఎదురుచూస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విశాఖలో వాతావరణం వేడెక్కింది.












Click it and Unblock the Notifications