లగడపాటి పద్ధతి బాగా లేదు: పొన్నం

లగడపాటి మాయం వ్యవహారంలో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని ఆయన అన్నారు. ఒక్క ఎంపీ పోలీసులను దబాయించడం పెద్ద వ్యవహారం కాదని, దబాయిస్తే పోలీసులు పక్కకు జరుగుతారని, ప్రజాప్రతినిధులుగా తాము అలా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. లగడపాటి మనసు మార్చుకోవాలని ఆయన కోరారు. లగడపాటి క్షేమం గురించి తాము ఆందోళన చెందుతున్నామని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధి అలా వ్యవహరిస్తే బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన అడిగారు. పార్టీ పార్లమెంటు సభ్యుడిగా లగడపాటి కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications