తెలంగాణ గొడవ: చిరంజీవికి మోహన్ బాబు థ్యాంక్స్

Mohan Babu
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఐక్యతలేదని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్‌ సినిమా 'వరుడు' షూటింగ్‌ యూనిట్‌ పై జరిగిన దాడిని ఖండించారు. అల్లు అర్జున్‌ తనకు బిడ్డలాంటివాడన్నారు. తమ యూనిట్‌పై నిన్న దాడి జరిగితే ఇప్పటి వరకు పరిశ్రమలోని ప్రముఖులు ఎవరూ ఫోన్‌ కూడా చేయలేదన్నారు.

తమ యూనిట్‌పై జరిగిన దాడిని ఖండించినందుకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వెంటనే స్పందించడం తనకు సంతోషంగా ఉందన్నారు. సమైక్యాంధ్ర కోసం చిరంజీవితో చేతులు కలుపుతానని ఆయన చెప్పారు. చేతులు కలిపి అందరం ఒకటిగా ఉందామని ఆయన సినీపరిశ్రమలోనివారికి పిలుపు ఇచ్చారు.విలేకరుల సమావేశం జరిగే సమయంలోనే కొంతమంది ఎల్‌బి నగర్‌ మహిళలు వచ్చి మోహన్‌బాబుకు మద్దతు తెలిపారు. ఎంతమంది నాలుకలు కోస్తారో చూస్తామని వారు కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+